లావణ్య కోసం మెగా హీరోల త్యాగం.. వారం రోజులపాటు సందడే సందడి!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వివాహ బంధంలోకి అడుగుపెట్టే సమయం రానే వచ్చేసింది.

Update: 2023-10-09 07:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వివాహ బంధంలోకి అడుగుపెట్టే సమయం రానే వచ్చేసింది. వీరి పెళ్లి ఇటలీలో గ్రాండ్‌గా జరగనుందని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. కాగా వరుణ్-లావణ్య పెళ్లికి మెగా హీరోలందరూ వారం రోజుల పాటు బ్రేక్ ఇవ్వనున్నారట. ప్రస్తుతం రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరొకవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో ‘పుష్ప 2’ మూవీ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతూ ఉండగా.. ఈ చిత్ర షూటింగ్ కూడా వారం రోజులపాటు వాయిదా పడబోతోందని టాక్. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తన ‘‘వారాహి యాత్ర’’ సినిమాను వారం రోజులపాటు పోస్ట్ పోన్ చేయనున్నారట.

Tags:    

Similar News