పీరియాడికల్ హై యాక్షన్ మూవీతో మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌.. పోస్టర్ రిలీజ్

హీరో సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది ‘విరూపాక్ష’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సాయి ధరమ్ తేజ్ ప్రజెంట్ పీరియాడికల్ హై యాక్షన్ మూవీతో అలరించేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Update: 2024-06-22 04:58 GMT

దిశ, సినిమా: హీరో సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది ‘విరూపాక్ష’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సాయి ధరమ్ తేజ్ ప్రజెంట్ పీరియాడికల్ హై యాక్షన్ మూవీతో అలరించేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వర్కీంగ్ టైటిల్ ‘ఎస్‌డీటీ 18’ పేరుతో పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. సాయి ధరమ్ తేజ్ హీరోగా రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ను నిర్మాతలు విడుదల చేశారు.

ల్యాండ్ మైన్లతో చుట్టుముట్టబడిన ఎడారి భూమిలో పచ్చని చెట్టుతో ఉన్న పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పోస్టర్‌ చూస్తుంటే ఓ యూనివర్శల్‌ కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. 'ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నాం. పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్‌ పాత్ర చాలా శక్తివంతంగా వుంటుంది. ప్రస్తుతం ఓ భారీ సెట్‌లో ఈ చిత్రం తొలిషెడ్యూల్‌ జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం' అన్నారు. కాగా ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు.



 


 



 



 



Similar News