వివాదంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్.. మండిపడుతోన్న పండితులు

మెగా అల్లుడు సాయిధరమ్ తేజ్ హీరో, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన లేటేస్ట్ చిత్రం ‘బ్రో’.

Update: 2023-07-15 03:39 GMT
వివాదంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్.. మండిపడుతోన్న పండితులు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరో, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన లేటేస్ట్ చిత్రం ‘బ్రో’. యాక్టర్ సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 28వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా హీరో సాయి ధరమ్ తేజ్ బ్రో మూవీ సక్సెస్ కావాలని ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తిలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే, శ్రీకాళహస్తిలో సాయి ధరమ్ తేజ్ చేసిన ప్రత్యేక పూజ వివాదస్పదమవుతోంది.

పూజ సమయంలో శ్రీకాళహస్తిలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో స్వయంగా సాయి ధరమ్ తేజ్ దేవుడికి హారతులిచ్చాడు. దీనిపై వివాదం నెలకొంది. నియమాల ప్రకారం దేవుడికి కేవలం అర్చకులు మాత్రమే హారతులివ్వాలని.. భక్తులు నేరుగా దేవుడికి హారతులివ్వడం విరుద్ధమని పండితులు మండిపడుతున్నారు. కాగా, ఈ వివాదంపై సాయి ధరమ్ తేజ్ ఇప్పటి వరకు రియాక్ట్ అవ్వలేదు. ఇదిలా ఉంటే, మామ, అల్లుళ్లు నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చాలా కాలం తర్వాత మరోసారి తెరపై కనిపిస్తుండటంతో బ్రో సినిమా కోసం ఆయన అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Also Read: మళ్లీ మొదలైన గొడవలు.. రాజీవ్ కనకాలను కాదని ఆస్తి మొత్తం వారిపైనే రాసిన సుమ?

Tags:    

Similar News