అల్లు అర్జున్ రేవు దాటాక తెప్పతగలేసే రకం.. దారుణంగా ట్రోల్ చేస్తున్న మెగా ఫ్యాన్స్!

టాలీవుడ్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప సినిమాతో ఏకంగా పాన్‌ ఇండియా రేంజ్‌లో పాపులారిటీ దక్కించుకున్నారు.

Update: 2023-09-04 06:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప సినిమాతో ఏకంగా పాన్‌ ఇండియా రేంజ్‌లో పాపులారిటీ దక్కించుకున్నారు. ఇటీవల పుష్ప సినిమాలో బన్నీ నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు కూడా అందుకున్నాడు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ బన్నీని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇటీవల పవన్ కల్యాణ్‌ పుట్టినరోజున శుభాకాంక్షలు చెప్పకపోవడమే ఈ ట్రోలింగ్‌కు కారణం. అంతకుముందు రెండ్రోజుల వరకు సోషల్ మీడియాలో సూపర్ యాక్టీవ్‌గా ఉన్న బన్నీ.. తీరా పవన్ కల్యాణ్ పుట్టినరోజునే కనీసం విష్ చేయకుండా మౌనం వహించారు. కాగా, పవన్ పుట్టినరోజుకు కొన్ని రోజుల ముందే బన్నీకి నేషనల్ అవార్డు వచ్చింది.. దీంతో పవన్ కల్యాణ్ అల్లు అర్జున్‌ను ప్రత్యేకంగా అభినందిస్తూ జనసేన పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా విషెస్ చెప్పారు.

దీంతో బన్నీ తీరుపై మెగా ఫ్యాన్స్ దారుణంగా సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ‘‘అవకాశవాది అంటూ.. నేషనల్ అవార్డు రావడంతో బిల్డప్ ఎక్కువైందంటూ.. రేవు దాటాక తెప్పతగలేసే రకం’’ అంటూ ఘోరంగా కామెంట్లు పెడుతున్నారు. చిరు ఫ్యామిలీ కాకపోయి ఉంటే ఇండస్ట్రీలోకి అంత గ్రాండ్ ఎంట్రీ ఉండకపోయేదని, తెలుగు సినిమా అభిమానులు బన్నీని చిరు ఫ్యామిలీ హీరోగానే గుర్తించారని మండిపడుతన్నారు. మరోవైపు పవన్ కల్యాణ్‌కు ఫోన్ చేసి విష్ చేసి ఉండొచ్చని మరి కొందరు అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. మొత్తంగా పవన్ కల్యాణ్ పుట్టినరోజు బన్నీ విష్ చేయకపోవడం పెద్ద వివాదానికే దారి తీసింది.

Full View

Read More:   వైరల్ అవుతున్న Tamannaah ఎమోషనల్ కామెంట్స్.. Vijay Varmaతో మనస్పర్థలు వచ్చాయా? 

Tags:    

Similar News