Mega Family: మీడియా రంగంలోకి మెగా ఫ్యామిలీ

చిత్ర పరిశ్రమలోనే కాక రాజకీయాల్లోనూ తమదంటు ఒక ముద్ర వేసుకున్న మెగా ఫ్యామిలీ ఇప్పుడు మీడియా రంగంలోకి అడుగుపెడుతున్నారు.

Update: 2024-08-12 11:00 GMT
Mega Family: మీడియా రంగంలోకి మెగా ఫ్యామిలీ
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: చిత్ర పరిశ్రమలోనే కాక రాజకీయాల్లోనూ తమదంటు ఒక ముద్ర వేసుకున్న మెగా ఫ్యామిలీ ఇప్పుడు మీడియా రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఎన్ మీడియా ఎంటర్టైన్‌మెంట్స్ పేరుతో మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు ఈ మీడియా చానెల్ ను నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని నాగబాబు కొద్ది రోజుల క్రితమే ప్రకటించగా.. ఇప్పుడు ఎన్ మీడియా కోసం ఓ కొత్త ఆఫీస్ ని ఓపెన్ చేశారు. దీనికి సంబందించిన దృశ్యాలు నెట్టింట దర్శనమిస్తున్నాయి. ఇందులో నాగబాబు భార్య, కుతురు నిహారిక తో కలిసి నూతన ఆఫీస్ ను ఓపెన్ చేశారు. ఎన్ మీడియా ఆఫీస్ గోడలపై సినిమా పేర్లు, మెగా ఫ్యామిలీ సినిమాల పోస్టర్లతో పాటు మెగా బ్రదర్స్ ఫోటోలను సైతం అతికించారు. అయితే ప్రస్తుతానికి ఎన్ మీడియాను యూట్యూబ్ ఛానెల్ నుంచి నడిపించనున్నారు. ఇందులో ఎంటర్టైన్‌మెంట్, భక్తి, హెల్త్ సహా పలు ఇంటర్వ్యూలు కూడా చేయనున్నారని తెలిసింది. కొద్ది రోజుల తర్వాత పొలిటికల్ న్యూస్ పెట్టనున్నారని ప్రోమో ద్వారా తెలుస్తుంది. కాగా మెగా బ్రదర్ నాగబాబు గతంలో 'అంతా నా ఇష్టం', 'నాగబాబు ఛానెల్' సహా పలు యూట్యూబ్ ఛానెళ్లను నడిపించారు.

Tags:    

Similar News