భర్తతో విడిపోయిన మెగాడాటర్ నిహారిక ..వరుణ్, లావణ్యల ఎంగేజ్‌మెంట్‌తో క్లారిటీ వచ్చినట్లేనా?

గత కొన్ని రోజుల నుంచి మెగా ఫ్యామిలీకి చాలా ఇష్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ముఖ్యంగా మెగా డాటర్ నిహారిక తన భర్తకు విడాకులిచ్చిందని చాలా వార్తలు వినిపించాయి. ఆ సమయంలో వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి ఇష్యూ

Update: 2023-06-10 07:57 GMT

దిశ, వెబ్‌డెస్క్ : గత కొన్ని రోజుల నుంచి మెగా ఫ్యామిలీకి సంబంధించిన చాలా ఇష్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా మెగా డాటర్ నిహారిక తన భర్తకు విడాకులిచ్చిందని  వార్తలు వినిపించాయి. ఆ సమయంలో వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి ఇష్యూ తెర మీదకు వచ్చింది. గత కొన్ని రోజుల నుంచి ప్రేమించుకుటున్న వీరికి నాగబాబు పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాడని, ఈ ఇష్యూతో నిహారిక విడాకుల గొడవ నెట్టింట్లో సద్దుమణుగుతుందనే నాగబాబు ఈ నిర్ణయం తీసుకున్నాడంటూ కథనాలు వచ్చాయి.

వాటికి తగ్గట్టుగానే నిన్న ఘనంగా వరుణ్ తేజ్, లావణ్యల ఎంగేజ్ మెంట్ జరిగింది. కుటుంబ సభ్యుల సమక్షంలో లావణ్య, వరుణ్ ఉంగరాలు మార్చుకున్నారు. త్వరలోనే ఈ జంట మూడు ముళ్ల బంధంతో ఒకటి కానుంది.

ఇక వ‌రుణ్‌-లావ‌ణ్య ఎంగేజ్మెంట్ తో మెగా డాట‌ర్ నిహారిక కొణిదెల‌ విడాకుల‌పై ఫుల్ క్లారిటీ వ‌చ్చేసిందని చాలా మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు. నిహారిక 2020 డిసెంబ‌ర్ లో చైత‌న్య జొన్న‌ల‌గ‌డ్డ‌తో ఏడ‌డుగులు వేసింది. వీరిది పెద్ద‌లు కుదిర్చిన సంబంధం. అయితే నిహారికకు తన భర్తకు మధ్య భేదాభిప్రయాలు ఉన్నాయని, త్వరలో వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోతున్నారు అనడానికి వీరి ఎంగేజ్మెంట్ సాక్ష్యం అంటున్నారు నెటిజన్స్. ఎందుకంటే లావణ్య, వరుణ్ నిశ్చితార్థ వేడుకలో, నిహారిక ఒక్కరే ఉన్నారు. ఈ ఫంక్షన్‌కు చైతన్య అంటెండ్ కాలేదు. దీంతో వీరు త్వరలో విడిపోతున్నారు అందుకే చైతన్య ఎంగేజ్ మెంట్‌కు హాజరు కాలేదని ముచ్చటిస్తున్నారు అభిమానులు.

Also Read:  ఏ సినిమా టైంలో లావణ్య, వరుణ్‌ల ప్రేమ మొదలైందో తెలుసా?

ఇటలీలో వరుణ్ తేజ్-లావణ్యల పెళ్లి? ఆందోళనలో మెగా అభిమానులు 

Tags:    

Similar News