Mechanic Rocky: ఫస్ట్ సింగిల్ గుల్లెడు గుల్లెడు సాంగ్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్ 'మెకానిక్ రాకీ’ తో అలరించబోతున్నాడు.

Update: 2024-08-05 11:17 GMT

దిశ, సినిమా: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్ 'మెకానిక్ రాకీ’ తో అలరించబోతున్నాడు. రవితేజ ముళ్లపూడి డైరెక్ట్ చేస్తున్నఈ చిత్రాన్ని SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మించారు. అయితే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఇక రీసెంట్‌గా రిలీజైన గ్లింప్స్‌కి అంచనాలను రెట్టింపు చేశాయి.

తాజాగా, మేకర్స్ ఇప్పుడు మ్యూజికల్ ప్రమోషన్స్‌ను కిక్ స్టార్ట్ చేస్తున్నారు. మెకానిక్ రాకీ ఫస్ట్ సింగిల్ గుల్లెడు గుల్లెడు ఆగస్టు 7న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. సాంగ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో విశ్వక్, మీనాక్షి చౌదరి బ్యూటీఫుల్ కెమిస్ట్రీని షేర్ చేసుకున్నారు. ట్రై యాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదల కానుంది.

Tags:    

Similar News