Goosebumps : మాస్ మహారాజా ‘Tiger Nageswara Rao’ మూవీ టీజర్ వచ్చేసింది..
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వర రావు’.
దిశ, సినిమా: టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వర రావు’. 1970ల్లో దేశంలో అతిపెద్ద దొంగగా పేరుగాంచిన స్టువర్టుపురం ‘టైగర్ నాగేశ్వర రావు’ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. యువ డైరెక్టర్ వంశీ ఈ మూవీని తెరకెక్కిస్తుండగా.. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ‘హైదరాబాద్, బాంబే, ఢిల్లీ ఇంకా అనేక నగరాల్లో దారుణంగా దోపిడీలు చేసిన స్టువర్టుపురం దొంగ మద్రాసు సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్నాడు’ అనే వార్త వాయిస్ ఓవర్‌తో మొదలైన టీజర్.. ‘నాగేశ్వర రావు పాలిటిక్స్‌లోకి వెళ్లి ఉంటే.. తన తెలివితేటలతో ఎలక్షన్స్‌లో గెలిచే వాడు. స్పోర్ట్స్‌లోకి వెళ్లి ఉంటే రన్నింగ్ రేసులో ఇండియాకు మెడల్ తెచ్చి ఉండేవాడు. ఆర్మీలోకి వెళ్లి ఉంటే తన ధైర్యంతో ఓ యుద్ధమే గెలిచి ఉండేవాడు. దురదృష్టకరంగా వాడు ఓ క్రిమినల్ అయ్యాడు సర్’ అని మురళీ శర్మ చెప్పిన డైలాగ్ చూస్తుంటే టైగర్ క్యార్టెక్టర్ ఎంత పవర్‌ఫుల్‍గా ఉండనుందో అర్థమవుతోంది. ఇక చివరలో బ్రిడ్జిపై వేగంగా వెళుతున్న ట్రైన్‍కు తాడువేసి రవితేజ చేసే యాక్షన్ సీక్వెన్స్ ఈ టీజర్‌లో హైలైట్‍గా నిలిచింది. ఇక మొత్తానికి అక్టోబర్ 20న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది.