ఈగల్ రివ్యూ: విభిన్న స్టోరీతో వచ్చిన మాస్ మహారాజ మెప్పించాడా?

మాస్ మహారాజ రవితేజ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఈగల్ సినిమా ఎట్టకేలకు విడుదలైంది.

Update: 2024-02-09 16:03 GMT

దిశ, సినిమా: మాస్ మహారాజ రవితేజ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఈగల్ సినిమా ఎట్టకేలకు విడుదలైంది. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్, నవదీప్, వినయ్ రాయ్, కావ్య థాపర్ కీలక పాత్రల్లో నటించారు. అక్రమ ఆయుధాల కట్టడికి హీరో చేసే పోరాటమే ఈగల్ కథ. ఇదివరకు ఎన్నడూ చేయని కొత్త రోల్‌లో నటించి రవితేజ మెప్పించారు. హీరో క్యారెక్టర్‌లో ఉండే డిఫరెంట్ షేడ్స్ మెప్పిస్తాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, డైలాగ్స్, ప్రొడక్షన్ వాల్యూస్, యాక్షన్ సీన్స్, సెంటిమెంట్స్ ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్‌లో డైరెక్టర్ హీరో ఎలివేషన్స్ పైనే దృష్టి పెట్టినట్లు అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి సెకండాఫ్ మొత్తం వేరే లెవెల్‌లో ఉంటుంది. కైమాక్స్‌తో పాటు పార్ట్-2 అంశాలు సినిమాపై అంచనాలు పెంచుతాయి. అయితే, సంక్రాంతి పండక్కి విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు ముందుగా ప్లాన్ చేశారు. అయితే, చాలా సినిమాలు సంక్రాంతికి పోటీ పడటంతో రవితేజ గౌరవంగా తప్పుకున్నాడు. ఎలాంటి పోటీ లేకుండా హాయిగా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ క్రమంలోనే ప్రేక్షకులు కోరుకున్నట్లు సినిమా ఉండటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News