‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ ట్రైలర్ రిలీజ్

సీనియర్ నటుడు రావు రమేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'మారుతీ నగర్ సుబ్రమణ్యం'.

Update: 2024-07-28 15:16 GMT

దిశ, సినిమా: సీనియర్ నటుడు రావు రమేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'మారుతీ నగర్ సుబ్రమణ్యం'. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ సతీమణి తబితా సుకుమార్ సమర్పణలో పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై రూపొందిన ఈ సినిమాకు లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఆగస్టు 23న రిలీజ్‌కు సిద్ధం కావడంతో... తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశాడు.

ఉదయాన్నే కిటికీ నుంచి వస్తున్న పొగలు చూసిన పొరుగింటి వ్యక్తి 'పొద్దున్నే పూజ మొదలు పెట్టావా? అగరబత్తి పొగలు కక్కుతోంది' అని అడిగితే... 'గోల్డ్ ఫ్లాక్ కింగ్ అని కొత్త బ్రాండ్ అగరబత్తి. నీ కూతురు వాడుతుంటే చూసి కొన్నాను' అనే డైలాగ్‌తో మొదలైన ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో విశేషంగా వైరల్ అవుతోంది. ఇందులో పాత్రలు, డైలాగ్స్, కంటెంట్ ఒక ఎత్తు అయితే... రావు రమేష్ నటన మరొక ఎత్తు. సినిమాపై ఈ ట్రైలర్‌ మరిన్ని అంచనాలు పెంచింది.

Tags:    

Similar News