ఈ రెండు కండిషన్స్‌కు ఒప్పుకుంటేనే పెళ్లి.. వరుణ్ విషయంలో లావణ్య అంత కఠినంగా ప్రవర్తిస్తుందా?

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వరుణ్ తేజ్-లావణ్య ఎంగేజ్మెంట్ వార్తలే వినిపిస్తున్నాయి.

Update: 2023-06-13 15:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వరుణ్ తేజ్-లావణ్య ఎంగేజ్మెంట్ వార్తలే వినిపిస్తున్నాయి. వీరిద్దరి నిశ్చితార్థం సంబంధించిన వార్తలు, ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. గుట్టుచప్పుడు లేకుండా వీళ్ళు ప్రేమను కొనసాగించి ఇప్పుడు పుకార్లకు చెక్ పెట్టేశారు. కాగా.. లావణ్య మెగా ఇంటి కోడలు అవ్వడానికి ముందే వరుణ్‌ ఆమెకు కొన్ని కండిషన్స్ పెట్టాడట. ఆ కండీషన్స్ ప్రకారమే ఆమె నడుచుకుంటాని చెప్పడంతో ఈ పెళ్లికి ఒకే చెప్పాడట. అయితే లావణ్య కూడా వరుణ్‌కు ఒక కండీషన్ పెట్టిందట. సినిమాల్లో నటించడం మానేస్తే ప్రొడక్షన్ వైపు వెళ్తానని ప్రామిస్‌ కూడా చేపించుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే తనకు భరత నాట్యం అంటే ఎంతో ఇష్టమని స్టేజ్ షోస్ చేయడానికి ఆసక్తి చూపిస్తానని.. ఆ విషయంలో మాత్రం ఎలాంటి కండిషన్స్ పెట్టకూడదని చెప్పిందట.

Read more: లావణ్యను వరుణ్ ప్రేమించడానికి ఈ 3 లక్షణాలే కారణమట

పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసుకున్న వరుణ్, లావణ్య.. ఎప్పుడంటే..?

Tags:    

Similar News