వారం రోజుల్లో పెళ్లి.. అత్తారింట్లో దర్శనమిచ్చి కన్ఫార్మ్ చేసిన సోనాక్షి సిన్హా!
బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు పలు మూవీస్ చేస్తూ స్టార్ బ్యూటీగా ఇండస్ట్రీలో కొనసాగుతుంది.
దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు పలు మూవీస్ చేస్తూ స్టార్ బ్యూటీగా ఇండస్ట్రీలో కొనసాగుతుంది. అయితే సోనాక్షి గత కొద్ది కాలంగా నటుడు జహీర్ ఇక్బాల్‌తో ప్రేమలో ఉన్నట్లు తొందరలో పెళ్లి కూడా చేసుకోబోతుందంటూ కొన్ని రోజుల నుంచి నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా ఈ నెల 23న వీరిద్దరు గ్రాండ్‌గా పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ పుకార్లు జోరందుకున్నాయి.
ఈ మేరకు ఓ వెడ్డింగ్ కార్డ్ కూడా వైరల్ అయింది. రూమర్డ్స్ లవ్ బర్డ్స్‌లా ఉన్న మేము తొందరలో భార్యాభర్తలుగా మారబోతున్నాం మీరు ఎక్కడున్నా జూన్ 23కి జరగబోయే మా పెళ్లికి రావాలని అందులో ఉంది. ఈ క్రమంలోనే ఆమె తండ్రి ఈ వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చాడు. వాటిలో ఎలాంటి నిజం లేదని అన్నాడు. కానీ సోనాక్షి మాత్రం స్పందించలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ అమ్మడు కాబోయే అత్తారింట్లో దర్శమిచ్చిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
జూన్ 16న ఆదివారం ఫాదర్స్ డే కావడంతో జహీర్ ఇక్బాల్ సోదరి ప్రముఖ స్టైలిస్ట్ సనం రతంసి ఓ ఫొటోను షేర్ చేసింది. అందులో సోనాక్షి కూడా ఉండటంతో పెళ్లి వార్తలో నిజమేనని అంతా పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. వారం రోజుల్లో పెళ్లి పెట్టుకుని కాబోయే అత్తారింటికి అప్పుడే పోయిందా అని అంటున్నారు. అంతేకాకుండా పెళ్లి విషయాన్ని ఈ విధంగా కన్ఫార్మ్ చేసిందా అని గుసగుసలాడుకుంటున్నారు.