భారతీయ మహిళలు సోమరిపోతులే.. ఆ ధైర్యం లేదు
భారతదేశంలో చాలా మంది అమ్మాయిలు సోమరిపోతులేనంటోంది సోనాలి కులకర్ణి.
దిశ, సినిమా: భారతదేశంలో చాలా మంది అమ్మాయిలు సోమరిపోతులేనంటోంది సోనాలి కులకర్ణి. వారికి అధిక జీతంతో కూడిన భర్తలే కావాలంటూ తనదైన స్టైల్‌లో చురకలంటించింది. ఈ మేరకు ఇటీవల ఓ సమావేశంలో లింగ సమానత్వంపై మాట్లాడిన నటి స్త్రీలపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘ఇండియాలో చాలా మంది అమ్మాయిలు సోమరిపోతులే. బాగా సంపాదించే మొగుడు కావాలి. ఉద్యోగం, ఇల్లు, గ్యారెంటీ ఇంక్రిమెంట్లు ఉన్నవాడే భర్తగా రావాలి. కానీ ‘నేను ఏం చేయాలి?’ అని తమను తాము ప్రశ్నించుకునే ధైర్యం వారికి లేదు’ అని చెప్పుకొచ్చింది. చివరగా ‘మీ ఇంటి ఆడవాళ్లను ప్రోత్సహించండి. వారిని సమర్థవంతంగా తీర్చిదిద్దండి’ అంటూ తల్లిదండ్రలకు సూచించడం విశేషం.
ఇవి కూడా చదవండి:
మనసంత గుబులుగా అనిపిస్తుంది: సునీత వీడియో వైరల్