Manchu Manoj: నేను ఎప్పుడూ ఏ పార్టీకి సపోర్ట్ చేయలేదంటున్న మంచు మనోజ్
మంచు మనోజ్ మొదటి భార్యతో విడాకులు తీసుకుని .. ఆ తరువాత భూమా మౌనికని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ఆరంభించిన విషయం మనకి తెలిసిందే.
దిశ,వెబ్ డెస్క్: మంచు మనోజ్ మొదటి భార్యతో విడాకులు తీసుకుని .. ఆ తరువాత భూమా మౌనికని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ఆరంభించిన విషయం మనకి తెలిసిందే. అయితే ఇప్పుడు భర్తగా తన బాధ్యతను నిర్వర్తిస్తానని, తన భార్యకు మాత్రమే తోడుగా ఉంటానని మంచు మనోజ్ అంటున్నాడు. ఈ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందో ఇక్కడ తెలుసుకుందాం..
మంచు మనోజ్ సినిమా కెరీర్‌కు మధ్యలోనే పుల్ స్టాప్ పడింది. అయితే ఇప్పుడు మళ్లీ తనకు ఇష్టమైన సినిమా రంగంలోకి అడుగు పెట్టబోతున్నాడు. సరి కొత్త షో తో అందరినీ ఆకట్టుకోబోతోన్నాడు. ఉస్తాద్ అంటూ మంచు మనోజ్ రాబోతోన్నాడు. ఈ కొత్త షో ప్రమోషన్స్ కోసం మీడియా ముందుకు మనోజ్ వచ్చాడు. ఈ సారి ఎవరికి సపోర్ట్ చేస్తారని మీడియా ప్రతినిధులు అడగగా.. దీనికి మంచు మనోజ్ క్లారిటీగా సమాధానం ఇచ్చాడు.నేను ఎప్పుడూ ఏ పార్టీకి సపోర్ట్ చేయలేదు.. ఓట్ వేయమని అడగలేదు..అన్ని పార్టీల్లో నాకు స్నేహితులు ఉన్నారు.. అలాగే ఎప్పుడూ ఏ పార్టీకి మద్దతు ఇవ్వలేదు.. ఒక వేళ నా భార్య నిలబడితే. తన వెనుకే ఉంటాను.. ఆమెకే నా సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు మౌనిక కంటే ఎవ్వరూ ఎక్కువ కాదని మంచు మనోజ్ చెప్పుకొచ్చాడు.