నిన్న జగన్ నేడు పవన్.. పవర్ స్టార్ మార్షల్ ఆర్ట్స్ పోజ్‌పై Manchu Lakshmi కామెంట్స్

జనసేన పార్టీ అధినేత, హీరో పవన్​ కల్యాణ్‌ను ఉద్దేశిస్తూ నటి మంచు లక్ష్మి పెట్టిన ఓ పోస్ట్​ ప్రస్తుతం సోషల్​మీడియాలో వైరల్​అవుతోంది.

Update: 2022-12-14 09:24 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : జనసేన పార్టీ అధినేత, హీరో పవన్​ కల్యాణ్‌ను ఉద్దేశిస్తూ నటి మంచు లక్ష్మి పెట్టిన ఓ పోస్ట్​ ప్రస్తుతం సోషల్​మీడియాలో వైరల్​అవుతోంది. చాలా ఏళ్లుగా మార్షల్‌ ఆర్ట్స్‌కు దూరమైన పవన్‌ మళ్లీ ప్రాక్టీస్‌ను ప్రారంభించినట్లు ఇటీవలే సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. దానికి సంబంధించిన ఓ ఫొటోను షేర్‌ చేయగా.. అది కాస్త వైరల్ అయింది. దీంతో, పవన్ ఫ్యాన్స్ అంతా ఫుల్​ ఖుషీ అయ్యారు. పవన్‌ కల్యాణ్‌ గతంలో మార్షల్‌ ఆర్ట్స్‌ గురించి చెప్పిన మాటలు, ఆయన చేసిన ప్రాక్టీస్‌ను గుర్తు చేసుకున్నారు. 'అప్పటికీ ఇప్పటికీ ఏం మారలేదన్నా నీ ఫైర్‌', 'వింటేజ్‌ లుక్‌' అంటూ కామెంట్స్ చేశారు. అయితే, ఇప్పుడా ఫొటో సోషల్ మీడియాలో మళ్లీ ట్రెండ్ అవుతోంది. ఎందుకు ? అంటే దానికి నటి మంచు లక్ష్మీ కారణం. మంచు లక్ష్మీ కూడా మార్షల్ ఆర్ట్స్ చేస్తారు. ఇందులో భాగంగా గతంలో అచ్చం పవన్ స్టైల్‌లో​ఓ పోజు ఇచ్చింది.

దీంతో, ఓ నెటిజన్ ఆ ఫొటోను వెతికి తీసి.. పవన్​మార్షల్​ఫొటోకు జత చేసి పోస్ట్​ చేశాడు. అంతేకాదు, పవన్​ను విమర్శిస్తూ ఓ వ్యాఖ్య కూడా రాసుకొచ్చాడు. ఆఖరికి మంచు లక్ష్మి అక్క స్టిల్స్ కూడా కాపీ కోట్టే స్థాయికి దిగజారి పోయావు అంటూ పవన్‌పై కామెంట్స్ చేశాడు. ఈ పోస్ట్​ కాస్త తాజాగా మంచు లక్ష్మీ కంటపడటంతో తన ట్విటర్​ఖాతాలో పోస్ట్ చేసింది. 'మంచో చెడో పవన్ పక్కన నా ఫొటో ఉండటం థ్రిల్లింగ్​గా ఉంది' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇది చూస్తుంటే ఆమె పరోక్షంగా సెటైర్​వేసినట్లు అర్థమవుతోంది. దీంతో ఆ పోస్ట్​ ప్రస్తుతం సోషల్​మీడియాలో చర్చనీయాంశమైంది.

మంచు లక్ష్మి చేసిన పోస్ట్ పై పవన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. 'మార్షల్ ఆర్ట్స్‌(విలువిద్య)లో పోజులు అన్నీ ఒకే విధంగా ఉంటాయి అని...లక్ష్మిని చూసి పవన్ కాపీ చేయలేదు' అని ఆ పిక్ పోస్ట్ చేసిన నెటిజన్ పై, మంచు లక్ష్మిపై ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. కాగా, ఇటీవల సీఎం జగన్ కు సంబంధించిన ఓ వీడియోపై కూడా లక్ష్మి చేసిన కామెంట్స్ తో వైసీపీ ఫ్యాన్స్ తీవ్రంగా స్పందించారు. లక్ష్మి తీరు సరికాదని ట్రోల్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పవన్‌పై కూడా కామెంట్స్ చేయడంతో మరోసారి మంచు లక్ష్మి వివాదం కొనితెచ్చుకుందనే చెప్పాలి. 

Tags:    

Similar News