పవన్ అభిమానులకు షాక్ ఇచ్చిన మాళవిక.. అదంతా పుకారేనట!

‘ఉస్తాద్ భగత్‌సింగ్’లో పవన్ కల్యాణ్ సరసన నటిస్తున్నట్లు వస్తున్న వార్తలను మాళవికా మోహన్ కొట్టిపారేసింది.

Update: 2023-03-21 14:33 GMT

దిశ, సినిమా : ‘ఉస్తాద్ భగత్‌సింగ్’లో పవన్ కల్యాణ్ సరసన నటిస్తున్నట్లు వస్తున్న వార్తలను మాళవికా మోహన్ కొట్టిపారేసింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా.. హీరోయిన్స్ విషయంలో జనాలకు క్యూరియాసిటీ పెరిగిపోయింది. దీంతో ఎవరికి తోచిన పేరును వాళ్లు ప్రకటిస్తూ నెట్టింట రచ్చ చేస్తున్నారు.

కాగా దీనిపై రీసెంట్‌గా స్పందించిన మాళవిక.. ‘పవన్ అంటే నాకు ఆరాధనా భావం ఉంది. కానీ, నేను ఆయన ప్రాజెక్టులో నటించట్లేదు. ప్రస్తుతం మరో తెలుగు సినిమాతో బిజీగా ఉన్నా. ఈ చిత్రంతోనే తెలుగులో అడుగుపెట్టేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా’ అని చెప్పింది. అయితే ఆ తెలుగు సినిమా ప్రభాస్-మారుతి కాంబోలో వస్తున్నదేనని, అందులోనే ఓ కీ రోల్ పోషిస్తున్నట్లు నెటిజన్లు చర్చిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Read more:

Mahesh Babu: రాజమౌళి, మహేష్ సినిమా బడ్జెట్ ఏంతో తెలుసా?

Tags:    

Similar News