రెండోసారి లవ్ మ్యారేజ్‌కు రెడీ అయిన షారుఖ్ హీరోయిన్.. డేట్, ప్లేస్ ఫిక్స్!

పాకిస్థాన్ నటి మహిరా ఖాన్ త్వరలోనే అభిమానులకు తీపి కబురు చెప్పబోతున్నట్లు తెలుస్తోంది.

Update: 2023-08-17 14:18 GMT

దిశ, సినిమా: పాకిస్థాన్ నటి మహిరా ఖాన్ త్వరలోనే అభిమానులకు తీపి కబురు చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. తన చిరకాల ప్రియుడు సలీమ్ కరీమ్‌ను సెప్టెంబర్‌లో పెళ్లి చేసుకోనున్నట్లు పలు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ఇటీవలే ఇరువురి కుటుంబాలు వీరి మ్యారేజ్‌పై చర్చలు జరిపాయని, సన్నిహితులు, ఫ్రెండ్స్‌ను మాత్రమే ఈ వేడుకకు ఆహ్వానించబోతున్నట్లు టాక్ నడుస్తోంది. అలాగే పంజాబ్‌లోని ప్రశాంతమైన హిల్ స్టేషన్‌లోనే వివాహం చేసుకోవాలని మహిరా-సలీమ్ ఫిక్స్ అయ్యారని సమాచారం. ఇక ఇటీవలే తన బాయ్ ఫ్రెండ్ గురించి ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో మాట్లాడిన నటి ‘‘హమ్‌సఫర్’ సినిమాలో నాకు నచ్చిన ఒక లైన్ ఉంది. అక్కడ ఖిరాద్‌తో అషర్ ఇలా అంటాడు. ‘మీతో చెలిమికి అర్హత సాధించడానికి నేను ఏమి చేశానో నాకు తెలియదు. నేను అతని గురించి అదే అనుకుంటున్నా’ అని చెబుతూ కాబోయే భర్తను పొగిడేసింది. ఇక 2017లో షారుఖ్ ఖాన్ సినిమా ‘రాయీస్‌’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఆమె.. గతంలో అలీ అస్కారీని వివాహం చేసుకోగా ఒక కొడుకుకు జన్మనిచ్చిన తర్వాత 2015లో అతనితో విడిపోయింది.


Tags:    

Similar News