ఉరీ దాడిలో నన్ను బలిపశువును చేశారు.. ఆన్‌లైన్ బెరింపులపై పాకిస్థాన్ నటి ఎమోషనల్

షారుఖ్‌తో నటించిన ‘రాయీస్’ సినిమా తర్వాత తాను ఎదుర్కొన్న భయంకరమైన అనుభవాలపై ఓపెన్ అయింది పాక్ నటి మహిరా ఖాన్.

Update: 2023-08-30 07:32 GMT

దిశ, సినిమా: షారుఖ్‌తో నటించిన ‘రాయీస్’ సినిమా తర్వాత తాను ఎదుర్కొన్న భయంకరమైన అనుభవాలపై ఓపెన్ అయింది పాక్ నటి మహిరా ఖాన్. ‘భారతదేశంలో భారీ సంఖ్యలో అభిమానులున్నారు. కానీ నేను ఊహించని విధంగా 2016 ఉరీ దాడి ఎఫెక్ట్ నాపై కూడా పడింది. పాకిస్థాన్ నటులు బాలీవుడ్‌లో పని చేయకుండా నిషేధించబడ్డారు. అయితే నేను అప్పటికే ఈ సినిమా పూర్తి చేసాను. అయినా రెండు దేశాల నెటిజన్ల నుంచి ట్విట్టర్‌లో భయకరమైన బెదిరింపులు వచ్చాయి. దీంతో కొంత కాలం నేను నిద్రపోలేదు.

నిరాశలో కూరుకుపోయాను. నాలో ఎప్పుడూ ఉండే ఆందోళన, డిప్రెషన్ మరింత పెరిగిపోయింది. వణికిపోయాను. దాని నుంచి బయటపడేందుకు థెరపీకి వెళ్లినా ఫలించలేదు. నిజంగా అదొక కష్టకాలం’ అని ఎమోషనల్ అయింది. అయితే ఇరు దేశాల ప్రజలు బాగానే ఉన్నప్పటికీ రాజకీయమే చాలా గందరగోళం సృష్టించిందన్న నటి.. దీంతో సినిమా ప్రచారాన్ని ఆస్వాదించలేకపోయానని చెప్పింది. ఏది ఏమైనా జనాలు సినిమాహాళ్లకు ఎగబడతారనే విషయంలో మాత్రం క్లారిటీ ఉందని, అదొక్కటే ఉపశమనాన్ని అందించిందని చెప్పింది.


Tags:    

Similar News