యుద్ధం చేశా.. సోనాలి బింద్రే నాకు ఇన్స్పిరేషన్ : నటి
దిశ, సినిమా: బాలీవుడ్ నటి మహిమా చౌదరి నటుడు సంజయ్ దత్ క్యాన్సర్ కథ తనకు స్ఫూర్తినిచ్చిందంటోంది. ఇటీవల బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ చేయించుకున్న నటి.. ఈ వ్యాధితో చేసిన పోరాటాన్ని గుర్తుచేసుకుంది..Latest Telugu News
దిశ, సినిమా: బాలీవుడ్ నటి మహిమా చౌదరి నటుడు సంజయ్ దత్ క్యాన్సర్ కథ తనకు స్ఫూర్తినిచ్చిందంటోంది. ఇటీవల బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ చేయించుకున్న నటి.. ఈ వ్యాధితో చేసిన పోరాటాన్ని గుర్తుచేసుకుంది. ఎంతో మంది జీవితకథలు తనకు ఆదర్శంగా నిలిచాయన్న ఆమె.. 'సంజయ్, మహేష్ మంజ్రేకర్ అందరం కలిసి 'కురుక్షేత్ర' సినిమా చేశాం. విచిత్రంగా మేమంతా ఒకే సమయంలో క్యాన్సర్‌తో పోరాడాల్సి వచ్చింది. సోనాలి బింద్రే, మనీషా కొయిరాలా, తాహిరా కశ్యప్ జీవితం నాకు స్ఫూర్తినిచ్చాయి' అని చెప్పుకొచ్చింది. ఇక ఈ వ్యాధిని 'మానసిక యుద్ధం'గా పేర్కొన్న నటి.. నాలుగు నెలల పాటు చికిత్స కొనసాగిందని తెలిపింది. అలాగే కష్టసమయంలో మద్దతుగా నిలిచిన అనుపమ్ ఖేర్‌కు కృతజ్ఞతలు తెలిపిన మహిమ.. ఈ క్లిష్ట సమయంలో తన కూతురే సపోర్ట్ సిస్టమ్‌గా నిలిచిందని వివరించింది.