Mahesh Babu ‘గుంటూరు కారం’లో హీరోయిన్ ఫిక్స్!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గుంటూరు కారం’.
దిశ,సినిమా: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గుంటూరు కారం’. ఈ మూవీ నుంచి పూజా హెగ్డే తప్పుకోవడంతో శ్రీలీలను తీసుకున్నారు. అలాగే సెకండ్ హీరోయిన్‌గా మీనాక్షి చౌదరిని తీసుకున్నట్లు టాక్ వినపడుతుంది. కానీ అఫీషియల్‌గా మాత్రం వెల్లడించలేదు. అయితే మీనాక్షి, విజయ్ ఆంటోనీతో కలిసి ‘హత్య’ మూవీలో నటిస్తుంది. రీసెంట్‌గా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో భాగంగా మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. ‘‘గుంటూరు కారం’ సినిమాలో అవకాశం వస్తుందని అస్సలు అనుకోలేదు. నేను మహేష్ బాబుకు పెద్ద ఫ్యాన్. మొదటి షెడ్యూల్ కూడా పూర్తయింది. ఇందులో నటించడం చాలా సంతోషంగా ఉంది’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది.