రాయల్ లుక్‌లో మహేష్ బాబు.. పిక్స్ వైరల్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎలాంటి సినిమా వచ్చినా అది బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని స్థాయిలో ఓపెనింగ్ అందుకుంటుంది.

Update: 2023-04-06 08:47 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎలాంటి సినిమా వచ్చినా అది బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని స్థాయిలో ఓపెనింగ్ అందుకుంటుంది. ఆయన సినిమాల్లో ఎలా ఉంటాడో.. రియల్ లైఫ్‌లో కూడా అదే తరహా గ్లామర్ మెయింటైన్ చేస్తున్నాడు. తాజాగా మహేష్ బాబు ఒక ఫొటో షూట్ చేయగా నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. స్కై బ్యాక్ గ్రౌండ్‌లో రాయల్ లుక్‌లో కనిపించాడు మహేష్. చెప్పాలంటే మహేష్ సోషల్ మీడియాలో సందర్భాన్ని బట్టి కనిపిస్తుంటాడు. అంతగా ఫొటోలు షేర్ చేయడాన్ని ఇష్టపడడు. చాలా గ్యాప్ తర్వాత మహేష్‌ను ఈ లుక్‌లో చూసేసరికి అభిమానులు తెగ సంబరపడుతున్నారు. ఈ పిక్స్ చూస్తుంటే త్రివిక్రమ్ సినిమాలో మ‌హేష్ చాలా అందంగా క‌నిపింబోతున్నట్లు తెలుస్తుంది. 

Tags:    

Similar News