11 ఏళ్ల వయసులో మహేష్ బాబు నడిపిన మొదటి బైక్ ఏంటో తెలుసా?
చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రిన్స్ బాలనటుడిగా 9 చిత్రాల్లో నటించి.. తండ్రికి మించి కొడుకు అనిపించుకున్నాడు.
దిశ, సినిమా: చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రిన్స్ బాలనటుడిగా 9 చిత్రాల్లో నటించి.. తండ్రికి మించి కొడుకు అనిపించుకున్నాడు. డ్యూయల్ పాత్రలు, సూపర్ కిడ్స్ మల్టీస్టారర్స్ చేశాడు. 1990లో తెరకెక్కిన ‘బాల చంద్రుడు’ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ అయినా ముఖ్య పాత్రలో నటించి నెటిజన్లను ఆశ్చర్చపరిచారు. ఈ క్రమంలో బైక్ రైడ్, హార్స్ రైడింగ్ వంటి సాహసాలు కూడా చేశాడట ప్రిన్స్.
సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూకు హాజరై.. ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. ప్రిన్స్ నడిపిన ఫస్ట్ బైక్ ఏంటో చెప్పుకొచ్చారు. సూపర్ స్టార్ నడిపిన మొదటి బైక్ టీవీఎస్ 50 అట. ఈ బైక్ నడిపేటప్పుడు ప్రిన్స్ ఏజ్ కేవలం పదకొండు సంవత్సరాలట. టీనేజ్ కూడా రాకుండానే బైక్ నడిపానని మహేష్ బాబు నవ్వుకుంటూ వెల్లడించారు.
ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ బాబు కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ హీరో స్టార్ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘రాజకుమారుడు’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్నారు. కోట్లలో అభిమానులను సొంతం చేసుకున్న వారిలో సూపర్ మహేష్ బాబు ఒకరు.
Read More..
మహేష్ బాబు చెల్లితో పెళ్లి జరగడంపై సుధీర్ ఆసక్తికర కామెంట్స్!