ఆకట్టుకుంటున్న 'ఒక్కడు' ట్రైలర్.. రీ రీలీజ్‌కు అంతా సిద్ధం

మహేశ్ బాబు కెరీర్‌లో వన్‌ ఆఫ్‌ ది మైల్ స్టోన్‌ మూవీగా నిలిచింది 'ఒక్కడు'. గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించి మేకర్స్‌కు కాసుల వర్షం కురిపించింది.

Update: 2022-12-25 06:45 GMT

దిశ, సినిమా: మహేశ్ బాబు కెరీర్‌లో వన్‌ ఆఫ్‌ ది మైల్ స్టోన్‌ మూవీగా నిలిచింది 'ఒక్కడు'. గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించి మేకర్స్‌కు కాసుల వర్షం కురిపించింది. ఇందులో భూమిక చావ్లా హీరోయిన్‌గా నటించింది. ఇక ఇప్పుడు దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ సినిమాను రీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. వచ్చే ఏడాది జనవరి 7న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేయగా.. ప్రమోషన్‌లో భాగంగా ఈ మూవీ 4కె వెర్షన్ ట్రైలర్ డిసెంబర్ 24న సాయంత్రం విడుదల చేశారు. ఆడియోను బుస్ట్ చేసి విజువల్‌కు 4కేను జతచేసిన రెండు నిమిషాల ట్రైలర్ అదిరిపోయింది.

Full View

Also Read..

'వారిసు'.. 'బృందావ‌నం' సినిమాకు రీమేకా? 

Tags:    

Similar News