మహేష్ బాబు అలాంటి వ్యక్తి అంటూ గుణశేఖర్ షాకింగ్ కామెంట్స్..?

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Update: 2023-04-05 04:48 GMT

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అనేక చిత్రాల్లో నటించి ఫ్యాన్స్‌లో ఫుల్ పాపులారిటీని సంపాదించుకుని సూపర్ స్టార్‌గా రాణిస్తున్నాడు. ప్రస్తుతం మహేష్‌బాబు వరుస సినిమాలతో ఫ్యామిలితో వెకేషన్స్‌కు దూసుకుపోతున్నాడు. తాజాగా, స్టార్ డైరెక్టర్ గుణశేఖర్, మహేష్ బాబుపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. గుణశేఖర్ శాకుంతలం సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో వరుస ప్రమోషన్స్‌లో చిత్ర యూనిట్ పాల్గొంటుంది. అయితే అందులో భాగంగా సూపర్ స్టార్‌పై గుణశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘మహేష్ బాబు చాలా ప్రమాదకరమైన వ్యక్తి. ఒక్కసారి ఆయనతో సినిమా చేశామంటే చాలు అతనికి అడిక్ట్ అయిపోతాం. మళ్ళీ మళ్ళీ అతనితోనే సినిమా చేయాలని అనిపిస్తుంది. అలా ఇప్పటివరకు నేను ఆయనతో ఒక్కడు, అర్జున్, సైనికుడు వంటి సినిమాలు తీశాను. ఈ తరం హీరోల్లో ఒకే డైరెక్టర్‌తో వరుసగా మూడు సినిమాలు చేసిన హీరోని ఎక్కడైనా చూశారా? నేను కూడా మహేష్ బాబుతో తీస్తే సరిపోదు. వేరే హీరోలతో కూడా తీయాలి. అందుకే ఇంత గ్యాప్ ఇచ్చాను" అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో గుణశేఖర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Tags:    

Similar News