ఒక్క ఫొటోతో క్లారిటీ ఇచ్చేసిన మహాలక్ష్మి- రవీందర్ కపుల్స్..
బుల్లి తెర నటి మహాలక్ష్మి , ప్రొడ్యూసర్ రవీందర్ ప్రేమించి పెళ్లి చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
దిశ, సినిమా: బుల్లి తెర నటి మహాలక్ష్మి , ప్రొడ్యూసర్ రవీందర్ ప్రేమించి పెళ్లి చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. చూడడానికి స్లిమ్‌గా, అందంగా కనిపించే మహాలక్ష్మి.. భారీ పర్సనాలిటీ కలిగిన రవీందర్‌ను పెళ్లి చేసుకోవడంతో అందరూ షాక్ అయ్యారు. డబ్బు కోసమే రవీందర్‌ను పెళ్లి చేసుకుందంటూ మహాలక్ష్మిపై విమర్శల వర్షం గుప్పించారు. ఇక పోతే ఇటీవల ఈ కపుల్స్ విడాకులు తీసుకుంటున్నట్లుగా పుకార్లు వచ్చాయి. ఇది విన్న మహాలక్ష్మి అలాంటిదేమీ లేదని ఒక్క ఫొటోతో క్లారిటీ ఇచ్చింది.
తాజాగా భర్తతో కలిసి దిగిన ఫోటో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఆమె.. ‘‘నువ్వు నా భుజంపై చేయి వేసినప్పుడు.. నేను ఏదైనా చేయగలనన్న ధైర్యం వస్తుంది. నా మనసు నిండా నువ్వే అమ్ము, ఐ లవ్ యూ’ అని తన భర్తపై ప్రేమతో రొమాంటిక్ పోస్ట్ పెట్టింది.. ఇక దీంతో తమ వైవాహిక బంధంపై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read..
60 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లి చేసుకున్న సీనియర్ నటుడు.. ఫొటోస్ వైరల్