‘శ్రీదేవి’ పై సంచలన కామెంట్స్ చేసిన ‘RGV’
కాంట్రావర్సీలకే కెరాఫ్ అడ్రాస్‌గా నిలిచాడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.
దిశ, సినిమా: కాంట్రావర్సీలకే కెరాఫ్ అడ్రాస్‌గా నిలిచాడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఒకప్పుడు ఈయన.. ‘శివ, మనీ, క్షణక్షణం’ వంటి చిత్రాలను తెరకెక్కించి ఇండస్ట్రీలో స్టార్ గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఆర్జీవీ సినిమా వస్తుందంటే ఎంతో మంది ఈగర్‌గా వెయిట్ చేసేవారు. కానీ రాను రాను వర్మ సినిమాలను పట్టించుకునే వాళ్లే కరువయ్యారు. వివాదాస్పద అంశాలతో మూవీస్ చేయడం ఇదో కారణమని చెప్పుకోవచ్చు. దీంతో సినిమా క్వాలిటీ తగ్గిపోతుంది.
ప్రస్తుతం ఆర్జీవీ ‘వ్యూహం’ సినిమాను తెరకెక్కించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి చనిపోవడంతో పవన్ కల్యాణ్, నారా లోకేష్, మెగాస్టార్ చిరంజీవి, ఇలా.. ప్రత్యర్థి పార్టీలు, నాయకులు ఏం చేశారు. ఆయన ఫ్యామిలీ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటోంది. అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తీశారు. పైగా దీన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్నారట. ఎప్పుడో విడుదలవ్వాల్సిన ఈ సినిమా టీడీపీ నాయకులు కోర్టులో కేసు వేయడంతో దీనిపై స్టే విధించారు.
అయితే తాజాగా శ్రీదేవి కారణంగా రామ్ గోపాల్ వర్మ కన్నీళ్లు పెట్టుకున్నారు. శ్రీదేవి అభిమాని.. ఏఐ ద్వారా శ్రీదేవి ఫొటోను సృష్టించాడు. యంగ్ అతిలోకసుందరి గా మార్చారు. కానీ ఆ బొమ్మలో ఆమెలాగా లేదు. ఈ పిక్ ను ఆర్జీవీ తన ట్విటర్ లో పంచుకుని.. ‘ఏఐ తో తయారు చేసిన శ్రీదేవి నన్ను ఏడిపించింది’. అని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈయన పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. బాధపడకు వర్మాజీ ప్రతి ఒక్కరి హార్ట్ లో శ్రీదేవి బతికే ఉంది. తన రూపం ఇంకా అలాగే ఉంది’. అని డైరెక్టర్ ను ఓదార్చుతూ కామెంట్లు పెడుతున్నారు. ఇక రామ్ గోపాల్ వర్మ.. శ్రీదేవికి పెద్ద ఫ్యాన్ అన్న విషయం తెలిసిందే.