రొమాన్స్ చేయడమంటే ఇష్టం.. మనసులో మాట బయటపెట్టిన Krithi Shetty!
‘ఉప్పెన’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది యంగ్ హీరోయిన్ ‘కృతి శెట్టి’. ‘
దిశ, వెబ్‌డెస్క్: ‘ఉప్పెన’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది యంగ్ హీరోయిన్ ‘కృతి శెట్టి’. ‘శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు, వారియర్’ లాంటి సినిమాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఈ అమ్మడుకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఇటీవల ఇంటర్వ్యూలో ఈ భామకు బోల్డ్ సీన్లపై ఓ ప్రశ్న ఎదురయ్యింది. ‘‘నాకు యాక్షన్ సన్నివేశాలు చేయడం కన్నా.. రొమాంటిక్ సీన్లలో నటించడమంటేనే ఎక్కువ ఇష్టం.’’ అంటూ చాలా ధైర్యంగా బదులిచ్చింది యంగ్ బ్యూటీ. దీంతో నెటిజన్లు ‘నువ్వు చేసిన మూడు సినిమాల్లో ఓ రేంజ్ ముద్దులిచ్చావ్, రొమాన్స్ చేశావ్. అవి సూపర్ హిట్ అయ్యాయి. మిగతా మూడు చిత్రాల్లో రొమాంటిక్ సీన్లు చేయలేదు. అవి అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం నెట్టింట కృతిశెట్టి సినిమాల పరిస్థితి ఏంటని చర్చించుకుంటున్నారు.