ఆ మూవీ ప్లాప్ అయితే చిరంజీవి అడుక్కు తినడం ఖాయమేనా?

Update: 2024-02-27 11:40 GMT

దిశ, సినిమా : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన తన స్వయం కృషితో తెలుగు చిత్రపరిశ్రమలో మెగాస్టార్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈయన నటించిన ఏ సినిమా అయినా సరే బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాల్సిందే. చిరంజీవి సినిమాలంటే అప్పటి జనరేషన్‌కు ప్రసెంట్ జనరేషన్‌కు చాలా ఇష్టం ఉంటుంది. మెగాస్టార్ మూవీ రిలీజ్ అవుతుందని తెలియగానే ముందుగానే టికెట్స్ బుక్ చేసుకొని పెట్టుకుంటారు. అంటే అంతలా ఆయన సినిమా అంటే మక్కువ ఉంటుంది. ఇక ప్రస్తుతం చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న మూవీ విశ్వంభర.

ఈ సినిమా కోసం చిరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కబోతుంది. ఇక ఈ సినిమాపై వశిష్ట రిలీజ్ చేసే ఒక్కో అప్డేట్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది.ఇప్పటికే ఈ సినిమాలో త్రిష నటించబోతుందని తెలిపిన విషయం తెలిసిందే. కాగా, మూవీకి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.ఈ సినిమాలో చిరంజీవి ట్విన్ బ్రదర్స్ గా కనిపించబోతున్నాడట . అంతేకాదు ఒక పాత్ర కోసం 70 ఏళ్లు పైబడిన వృద్ధుడిగా కనిపించబోతున్నాడట . చిరంజీవి ఈ ఏజ్ లో పెద్ద సాహసమే చేస్తున్నాడు అంటున్నారు అభిమానులు.

విశ్వంభర మూవీ కోసం చిరు చాలా రిస్క్ చేస్తున్నారు. బడ్జెట్ కూడా చాలా ఎక్కువ, ఈ సమయంలో ఇలాంటి రిస్క్ చేయడం అవసరమా.. దీని వలన మూవీ ప్లాప్ అయితే మెగాస్టార్ ఇబ్బందుల్లో పడాల్సి వస్తుందని తన ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న మరికొంత మంది, భారీ బడ్జెట్‌తో వచ్చే ఈ సినిమా గనుక ఫ్లాప్ అయితే చిరు అడుక్కుతినాల్సిందే, ఈ రిస్క్ అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ రిలీజై ఎంత పెద్ద హిట్ తన ఖాతాలో వేసుకుంటుందో చూడాలి మరి.


Similar News