Vijay Deverakonda : అప్పటి నుండే జీవితంలో అడ్జస్ట్ అవడం నేర్చుకున్నా

టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న యంగ్ హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు. ‘అర్జున్ రెడ్డి’ మూవీతో యూత్‌లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న

Update: 2024-03-27 07:12 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న యంగ్ హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు. ‘అర్జున్ రెడ్డి’ మూవీతో యూత్‌లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న విజయ్ అప్పటి నుంచి ఒకే యాంగిల్‌లో కాకుండా మంచి మంచి కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. ఇక చివరగా ‘ఖుషి’ అనే లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ తో వచ్చిన విజయ్ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 5 న థియేటర్లలో విడుదల కానుంది.

ఇక రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ఇప్పటికే ప్రమోషన్ పనులు కూడా మొదలు పెట్టారు టీం. కాగా ఈ ప్రమోషన్‌లలో భాగంగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న విజయ్ దేవరకొండ తన జీవితం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.. ‘ నా చిన్నతనం నుంచే జీవితంలో సర్దుకుపోవడం నేర్చుకున్నాను. స్కూల్‌కి వెళ్తున్న రోజుల్లో మా నాన్నను సైకిల్ కొనివ్వమని అడిగాను. ఆయన బర్త్‌డే కి కొంటాను ... సెలవుల్లో కొంటాను అని సాగదీసి చాలా రోజులకు ఎప్పుడో కొనిచ్చాడు. ఆ తర్వాత వీడియో గేమ్ , కంప్యూటర్ , టీవీ ఇలా చాలా విషయాల్లో అడ్జస్ట్ అయ్యాను. ఇక చిన్న వయసులో మాత్రమే కాదు ఇప్పటికి కూడా అనేక విషయాలలో సర్ధుకుపొతు జీవితాన్ని సాగిస్తున్నాను’ అని విజయ్ తెలిపాడు. ప్రజంట్ ఈ హీరో మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News