ఆ హీరోతో లయ పెళ్లి ఫిక్స్, అతడికి ఆ పిచ్చి, దాంతో బ్రేకప్.. హోమ్లీ హీరోయిన్ లవ్ స్టోరీ

సీనియర్ నటి లయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘స్వయంవరం’ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది.

Update: 2024-06-19 07:20 GMT

దిశ, సినిమా: సీనియర్ నటి లయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘స్వయంవరం’ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఇక ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ చిత్రం సూపర్ హిట్ కావడంతో లయకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఆ తర్వాత మనోహరం, ప్రేమించు, హనుమాన్ జంక్షన్, మిస్సమ్మ, నువ్వు లేక నేను లేను వంటి హిట్ చిత్రాల్లో ఆమె నటించారు. విజయేంద్ర వర్మ చిత్రంలో బాలయ్య వంటి స్టార్ పక్కన ఆమె జతకట్టారు.

కాగా లయ కెరీర్లో ‘ప్రేమించు’ సినిమా చాలా ప్రత్యేకం. ఈ మూవీలో ఆమె బ్లైండ్ అమ్మాయి పాత్ర చేసింది. సీనియర్ నటి లక్ష్మీతో పోటీపడి మరీ నటించింది లయ. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన ప్రేమించు సూపర్ హిట్ చిత్రంలో సాయి కిరణ్ హీరోగా నటించారు. అయితే సాయి కిరణ్- లయ ప్రేమలో ఉన్నారని అప్పట్లో పుకార్లు వినిపించాయి. ప్రేమించు మూవీ సమయంలోనే ఈ కథనాలు వెలువడగా... ఎవరూ స్పందించలేదు. అయితే లయను సాయి కిరణ్ వివాహం చేసుకోవాల్సిందట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఆ పెళ్లి ఎందుకు ఆగిపోయిందో కూడా చెప్పాడు.



ప్రేమించు మూవీలో లయతో నా కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. ప్రేక్షకులు ఆ చిత్రాన్ని బాగా ఆదరించారు. మా జంట చూడముచ్చటగా ఉండేది. దీంతో కుటుంబ సభ్యులు మాకు పెళ్లి చేయాలని అనుకున్నారు. అంతా ఓకే అనుకున్నాక.. మా ఇద్దరి జాతకాలు కలవలేదు. నాకు జాతకాల పిచ్చి ఉంది. కుటుంబ సభ్యులు కూడా గట్టిగా విశ్వసిస్తారు. ఈ కారణంగా లయతో నా వివాహం క్యాన్సిల్ అయ్యింది.. అని సాయి కిరణ్ చెప్పుకొచ్చాడు.


కాగా సాయి కిరణ్ హీరో, సపోర్టింగ్ రోల్స్ చేశారు. పాతిక పైగా చిత్రాల్లో నటించి ప్రస్తుతం సీరియల్ నటుడిగా కొనసాగుతున్నాడు. 2006లో లయ యూఎస్ లో సెటిల్ అయిన డాక్టర్ గణేష్ గోర్తిని వివాహం చేసుకుంది. వీరికి ఒక అమ్మాయి, అబ్బాయి సంతానం. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన లయ నితిన్ హీరోగా తెరకెక్కుతున్న ‘తమ్ముడు’ చిత్రంలో కీలక రోల్ చేస్తుంది.



Similar News