నేను పొగరుతో అలా చెప్పలేదు.. డొనేషన్ కాంట్రవర్సీపై లారెన్స్ క్లారిటీ

ప్రముఖ నటుడు లారెన్స్ తను నిర్వహిస్తున్న ‘రాఘవా లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్’ విరాళాలకు సంబంధించిన ఓ కాంట్రవర్సీపై స్పందించాడు.

Update: 2023-08-30 13:59 GMT

దిశ, సినిమా: ప్రముఖ నటుడు లారెన్స్ తను నిర్వహిస్తున్న ‘రాఘవా లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్’ విరాళాలకు సంబంధించిన ఓ కాంట్రవర్సీపై స్పందించాడు. కొంతకాలంగా ఈ ట్రస్ట్ పేరిట ఎంతోమంది పిల్లలు, దివ్యాంగులకు సేవలందిస్తున్న ఆయన.. తమ ట్రస్ట్‌కు విరాళాలు పంపొద్దంటూ ఇటీవల చేసిన ఓ ట్వీట్ విమర్శలకు దారితీసింది. దీంతో పలువురు నెటిజన్లు లారెన్స్ తీరును తప్పుబట్టారు. కాగా మరోసారి దీనిపై క్లారిటీ ఇస్తూ ఓ వీడియో షేర్ చేసిన లారెన్స్.. ‘నా ట్రస్ట్‌కు ఎవరూ డబ్బులు పంపించొద్దు. నా పిల్లలను నేనే చూసుకుంటానని ట్వీట్ చేయడానికి కారణం ఉంది. డ్యాన్స్ మాస్టర్‌గా ఉన్నప్పుడు 60 మంది పిల్లలతో ఈ ట్రస్ట్ మొదలుపెట్టాను. వారి బాధ్యతలు తీసుకునేందుకు ఒక్కడి ఆదాయం సరిపోక ఇతరుల సాయం తీసుకున్నా. కానీ ఇప్పుడు నేను యేడాదికి మూడు సినిమాలు చేస్తూ బాగానే డబ్బులు సంపాదిస్తున్నా. అందుకే ఆర్థికంగా ఎదిగిన తర్వాత ఇతరుల పైసలు వద్దనిపించింది. అంతేకానీ పొగరుతో వద్దనలేదు. నాకు ఇవ్వాలనుకున్న డబ్బులు వేరే ట్రస్ట్‌లకు అందించాలని కోరుతున్నా’ అంటూ స్పష్టంగా వివరించాడు. ఇక ఆయన నటించిన తాజా చిత్రం ‘చంద్రముఖి 2’ సెప్టెంబర్ 19న విడుదలకానుంది. 

Tags:    

Similar News