విజయ్‌ని హగ్ చేసుకున్న అభిమాని.. జలసీగా ఫీల్ అయిన సమంత (వీడియో)
సమంత, విజయ్ జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’.
దిశ, సినిమా: సమంత, విజయ్ జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది. ఇక విజయ్ ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ పనులని కూడా ఒంటరిగా మోస్తున్నాడు. కోయంబత్తూర్‌లో మూవీని ప్రమోట్ చేశాడు. అయితే తాజాగా సోషల్ మీడియా విజయ్, సమంత కలిసి ఇంఫ్లూయెన్సర్లతో చిట్ చాట్ చేశారు. కాగా ఈ క్రమంలో ఓ అమ్మాయి గురించి అక్కడ ఒక చర్చ జరిగింది. ఇక్కడ విజయ్‌ను ఒక అమ్మాయి హగ్ చేసుకున్న వీడియే షేర్ చేసి అందులో సమంత రియాక్ట్ అయిన తీరు గురించి నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ‘ఆమె కేతిక శర్మ అక్కనా? ఆమె హగ్ చేసుకోవడానికి దగ్గరకు వస్తే సమంత ఎందుకంత రియాక్ట్ అయింది? విజయ్‌ని హగ్ చేసుకుంటే సమంత ఈర్ష్య పడిందా?’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు ఆ వీడియోలో సమంత, విజయ్‌లు ఉన్న కూడా ఇప్పుడు నెటిజన్ల దృష్టి మాత్రం హాగ్ చేసుకున్న ఆ అమ్మాయి మీదనే ఉంది. ఆమె కోసం వెతుకులాట ప్రారంభించారు.
Yedho thedaaga undhe 🌚😅 pic.twitter.com/gMZDLN6lsd
— Allu Babloo AADHF (@allubabloo) August 20, 2023