రష్మిక ఫేస్ హిందీ ఇండస్ట్రీకి పనికిరాదు.. పరువు తీసిన బాలీవుడ్ నటుడు
బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ రష్మిక మందన్న టాలెంట్‌ను దారుణంగా అవమానించాడు.
దిశ, సినిమా: బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ రష్మిక మందన్న టాలెంట్‌ను దారుణంగా అవమానించాడు. నిరంతరం వివాదాస్పద విమర్శలతో వార్తల్లో నిలిచేందుకు ప్రయత్నించే కేఆర్కే.. నేషనల్ క్రష్‌కు బాలీవుడ్లో భవిష్యత్తు లేదని జోస్యం చెప్పాడు. ఐశ్వర్య, మాధురి, కరీనా లాంటి నటీమణులను చూసిన హిందీ ప్రేక్షకులు ఆమెను అంగీకరించరని ట్వీట్ చేశాడు. 'దక్షిణాదితోపాటు భోజ్‌పురి చిత్రాలకు రష్మిక లుక్ సరిపోతుంది. కానీ హిందీ చిత్రాల్లో రాణించాలనుకోవడం రాంగ్ చాయిస్. బాలీవుడ్ ఆడియన్స్ ఆమెను మెయిన్ లీడ్ హీరోయిన్గా యాక్సెప్ట్ చేయరు. ఆమెకు అంత సీన్ లేదు' అంటూ ముక్కు సూటిగా చెప్పేశాడు. అలాగే బాలీవుడ్ పరిశ్రమ చాలా కష్టతరమైన దశలో ఉందన్న నటుడు.. రణ్వీర్ సింగ్ కెరీర్ దాదాపు ముగిసిపోయిందని, వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న కరణ్ జోహార్ - రణ్వీర్ కాంబినేషన్లో వస్తున్న 'రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ' డిజాస్టర్‌గా మిగిలిపోతుందని ఎద్దేవా చేశాడు.
READ MORE