దుల్కర్ సల్మాన్‌కు జోడీగా కృతి శెట్టి.. టాలీవుడ్ స్టార్ హీరో నిర్మాణంలో మూవీ

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.

Update: 2024-07-06 09:58 GMT

దిశ, సినిమా: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇక తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898AD’ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించి మెప్పించాడు. ఇదిలా ఉంటే.. దుల్కర్ ప్రజెంట్ ‘లక్కీ భాస్కర్’ మూవీతో బిజీగా ఉన్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కతున్న ఇందులో యంగ్ అండ్ బ్యూటీఫుల్ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇదిలా ఉంటే.. ‘లక్కీ భాస్కర్’ ఇంకా రిలీజ్ కాకుండానే మరో సినిమాను లైన్‌లో పెట్టాడు దుల్కర్ సల్మాన్. తమిళ దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ డైరెక్షన్‌లో ఓ మూవీ చేయ్యబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఇందులో హీరోయిన్‌గా యంగ్ హీరోయిన్ కృతి శెట్టిని ఓకే చేసినట్లు టాక్. అంతేకాకుండా ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ హీరో రానా నిర్మించడంతో పాటు.. అందులో ఓ కీలక పాత్రలో కూడా నటించనున్నాడు అని సమాచారం. అయితే.. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలో వచ్చే చాన్సెస్ ఉన్నట్లు తెలుస్తుంది. 


Similar News