వైట్ లెహంగాలో కృతి శెట్టి.. దేవత అంటూ కామెంట్స్ చేస్తున్న ఫ్యాన్స్

ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ కృతిశెట్టి.

Update: 2024-06-10 07:45 GMT

దిశ, సినిమా: ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ కృతిశెట్టి. హీరో శర్వానంద్ తో మనమే సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటించింది. ఈ క్రమంలో ఆమె షేర్ చేసిన ఫోటోలు ఫోటోలు వైరల్‌గా మారాయి.

మొదటి సినిమాతోనే పెద్ద హిట్ అందుకుంది. ఈ అదృష్టం కొందరికే దక్కుతుంది. ఉప్పెన మూవీ రూ. 100 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్ నాని మూవీలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. నాగ చైతన్యతో బంగార్రాజు మూవీలో నటించి హ్యాట్రిక్ హిట్ అందుకుంది. అయితే, ఆ తర్వాత చేసిన సినిమాలు పెద్దగా ప్రభావం చూపలేదు. అందుకే, గత కొద్దిరోజులు నుంచి ఈ ముద్దుగుమ్మ ఖాతాలో డిజాస్టర్లు పడుతున్నాయి.

శర్వానంద్ హీరోగా ఇటీవల విడుదలైన మనమే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కృతి. ఈ మూవీ జూన్ 7న విడుదలైంది. ఈ నేపథ్యంలో కృతి షేర్ చేసిన ఫోటోలు కుర్ర కారుకు హీటెక్కిస్తున్నాయి. ఈ ముద్దుగుమ్మ వైట్ లెహంగాలో.. ఏంజెల్ లా ఉంది..ఇప్పుడే కిందకి దిగి వచ్చిన దేవతలా.. ఉన్నావంటూ ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.


Similar News