24 క్యారెట్ గోల్డ్ ప్రింట్ శారీ.. ‘ఆదిపురుష్’ ఈవెంట్‌లో మెరిసిన కృతి
ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘ఆదిపురుష్’.
దిశ, సినిమా: ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘ఆదిపురుష్’. శ్రీరాముడి పాత్రలో ప్రభాస్, సీతగా కృతిసనన్, రావణుడిగా పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తున్న ఈ మైథాలజికల్ మూవీ జూన్ 16న 14 భాషల్లో రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక జానకిగా నటించిన కృతి సనన్ ‘ఆదిపురుష్’ ట్రైలర్ ఈవెంట్‌లో కాస్లీ చీరతో దర్శనమిచ్చి అట్రాక్ట్ చేసింది. ప్రముఖ డిజైనర్ అబు జానీ, సందీప్ ఖోస్లా తయారు చేసిన ప్రత్యేకమైన శారీలో కృతి మైమరపించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట షేర్ చేసి సదరు డిజైనర్లు ఈ చీరను 24 క్యారెట్ గోల్డ్ ప్రింట్‌తో తయారు చేసినట్లు తెలిపారు.
Also Read: అదిరిపోయిన ‘ఆదిపురుష్’ ట్రైలర్.. మూడు నిమిషాల్లో రామాయణ గాథ చెప్పేశారు!!