దిశ, వెబ్‌డెస్క్ : రాధేశ్యామ్ సినిమా విడుదల కాబోతున్న సమయంలో రెబల్ ఫ్యాన్స్‌కు ఊహించని షాక్ తగిలింది. ప్రముఖ నటుడు, నిర్మాత కృష్ణంరాజు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అయితే ఇటీవల ఆయన తన ఇంటిలో కాలు జారీ పడిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు సర్జరీ చేయాల్సి ఉండగా, ఆయనకు సర్జరీ చేసి కాలు వేలు తొలిగించినట్టు సమాచారం. దీంతో ప్రభాస్ ఒక రోజు మొత్తం ఆసుపత్రిలోనే ఉన్నారు. ఇక రాధేశ్యం సినిమా విడుదలకు ముందే కృష్ణం రాజుకు సర్జరీ జరగడంతో ఆయన ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, రాధేశ్యాం సినిమాలో ఆయన కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.