ఎన్టీఆర్ చేసిన పనికి గోడు గోడు ఏడ్చేసిన స్టార్ లేడీ కమెడియన్..!
టాలీవుడ్ స్టార్ లేడీ కమెడియన్ కోవై సరళ (61) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు.
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ లేడీ కమెడియన్ కోవై సరళ (61) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. ముఖ్యంగా బ్రహ్మానందం కాంబినేషన్‌లో ఈమె చేసిన కామెడీ అంతా ఇంతా కాదు. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. అయితే, తాజాగా సరళ ఓ ఇంటర్వ్యూకు హాజరై తన జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘‘నాకు ఎన్టీఆర్ అంటే చిన్నప్పటి నుంచే ఎంతగానో ఇష్టం. నేను 6వ తరగతి చదివే టైంలోనే ఆయనను చూడాలని ఓ రోజు ఇంటిముందు నిల్చుని వేచి చూశాను. కానీ, ఎన్టీఆర్ నన్ను చూడకుండా హడావిడిగా వెళ్లడంతో చాలా ఏడ్చేశాను. దీంతో విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ నన్ను ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడారు.
అప్పుడు నాకు మాటలు రాలేదు. ఆయన అంటే ఎంతో ప్రేమ, అభిమానంతో కళ్లలోకి నీళ్లొచ్చేశాయి. నేను వెళ్లిన తర్వాత నా స్కూల్ ఫీజు ఆయనే పంపించాడు. ఇంట్లో తెలిస్తే తిడతారని ఎవ్వరికి చెప్పలేదు. అలాగే పదోతరగతి ఉన్నప్పుడే నాకు గర్భిణి పాత్రలో నటించే అవకాశం వచ్చింది. ఇక అప్పటి నుంచే నా కెరీర్ మొదలయ్యింది. నాకు నలుగురు చెల్లెల్లు వారికి పెళ్లిళ్లు చేసి.. వారి బాధ్యతలన్నీ నేనే చూసుకున్నాను. దీంతో నాకు పెళ్లిపై ఆలోచన రాలేదు.’ అంటూ కోవై సరళ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా మరోవైపు నిరుపేదలకు, ఆపదలో ఉన్నవారికి కూడా సాయం చేస్తానంటూ తెలిపింది.