బన్నీ ఇంటికి వెళ్లిన కోలీవుడ్ హీరోయిన్.. ఎందుకంటే..?
బన్నీ ఇంటికి వెళ్లిన కోలీవుడ్ హీరోయిన్..
దిశ, సినిమా : క్రాక్, వీరసింహా రెడ్డి, యశోద వంటి చిత్రాల్లో విలన్‌గా నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ త్వరలో పెళ్లి చేసుకోనుంది. ముంబైకి చెందిన వ్యాపారవేత్త నిచోలై సచ్‌దేవ్‌ని ఆమె త్వరలో వివాహం చేసుకోనుంది. రీసెంట్‌గా వీరిద్దరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. జూలైలో వీరి పెళ్లి జరగనుందని సమాచారం.
వరలక్ష్మి వివాహానికి సంబంధించిన పనులు వేగవంతమయ్యాయి. కాగా, తమిళనాడులో జరిగే తన వివాహానికి సినీ పరిశ్రమ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులను వరలక్ష్మి ఇప్పటికే ఆహ్వానించింది. ఈ సందర్భంగా అలు అర్జున్, అతని తండ్రి అలు అరవింద్‌లను ఇంటికి వెళ్లి ఆహ్వానించింది.
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే .. నిచోలై సచ్‌దేవ్ కూడా బన్నీకి వెడ్డింగ్ కార్డ్‌ని వచ్చారు. సినీ వర్గాలు వారే కాకుండా, నెటిజెన్స్, ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. టాలీవుడ్ స్టార్స్ లో బన్నీతో పాటు హీరో రవితేజ, దర్శకుడు హరీష్ శంకర్, ప్రశాంత్ వర్మ, హీరోయిన్ సమంత, పైడిపల్లి వంశీ, గోపీచంద్ మలినేని పెళ్లికి ఆహ్వానించారు.