Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం పెళ్లి ముహూర్తం ఫిక్స్ .. ఎక్కడో తెలుసా..?

కిరణ్ అబ్బవరం పెళ్లి ముహూర్తం ఫిక్స్

Update: 2024-08-20 06:26 GMT

దిశ, సినిమా : ఎస్ ఆర్ కల్యాణమండపం మూవీ తర్వాత హీరో కిరణ్ అబ్బవరం సినీ కెరీర్ పూర్తిగా మారిపోయింది. ఈ సినిమా కంటే ముందు రాజావారు రాణిగారు లో నటించాడు. అయితే, తన ఫస్ట్ మూవీ హీరోయిన్ రహస్య గోరఖ్ నే తన రియల్ లైఫ్ రాణిగా ఫిక్స్ అయ్యాడు.. ఆ మూవీ వల్లే వీరిద్దరి పరిచయం స్నేహంగా మారి ప్రేమ వరకు వెళ్ళింది. ఇలాగే వారు ఐదేళ్లు లవ్ చేసుకుని ఇరు కుటుంబాలను ఒప్పించి ఈ మధ్యే ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు.

వీరిద్దరి మీద మొన్నటి వరకు ఎన్నో వార్తలు వచ్చాయి.. ఎంగేజ్మెంట్ ఎప్పుడో చేసుకున్నారు.. కానీ పెళ్లి ఇంకా చేసుకోలేదంటూ చాలా మందికి సందేహం ఉంది. ఇప్పుడు వాటన్నింటికి చెక్ పెట్టె అదిరిపోయే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. కిరణ్, రహస్య పెళ్లి ఈ నెల ఆగస్టు 22న జరగబోతుందని సన్నిహితుల నుంచి తెలిసిన సమాచారం. ఆ రోజే మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు కూడా..

కాకపోతే వీరి పెళ్లి కర్ణాటక జిల్లాలో జరగబోతుందని.. ఎందుకంటే రహస్య కుటుంబానికి చెందిన బంధువులు మొత్తం అక్కడే ఉండటంతో అక్కడ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. హైద్రాబాద్ కి వచ్చిన తర్వాత తెలుగు సినీ ప్రముఖులకు గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసారని సినీ వర్గాల నుంచి టాక్. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Tags:    

Similar News