ట్రాన్స్‌జెండర్‌కు అందలం.. మురిసిపోతున్న కమ్యూనిటీ..
ప్రముఖ జర్మనీ సింగర్, ట్రాన్స్ జెండర్ అయిన కిమ్ పెట్రాస్ సరికొత్త రికార్డ్ నెలకొల్పింది.
దిశ, సినిమా: ప్రముఖ జర్మనీ సింగర్, ట్రాన్స్ జెండర్ అయిన కిమ్ పెట్రాస్ సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. అమెరికన్ స్పోర్ట్స్ మ్యాగజైన్ ‘స్విమ్‌సూట్ స్పోర్ట్స్ ఇలస్ట్రేటెడ్’ అనే పత్రిక న్యూ ఎడిషన్‌పై మొదటి లింగమార్పిడి కవర్ మోడల్‌గా దర్శనిమిచ్చి చరిత్ర సృష్టించింది. ‘ఈ పనికోసం నాకు పిలుపు వచ్చినప్పుడు చాలా సంతోషించాను. పెద్ద సెలబ్రిటీలు పాల్గొన్న వేదికపై నాకు అవకాశం రావడం కల నిజమైనట్లు అనిపిస్తుంది. ఇప్పుడు మరిన్ని సాధించగలమని భావిస్తున్నా’ అని కిమ్ చెప్పింది.
అలాగే మహిళలు పరిమితులు, అస్తిత్వ భయం లేకుండా జీవించగలిగేలా ప్రపంచం దృష్టిని ఆకర్షించేందుకు ఇదొక ఆదర్శం, సెంటిమెంట్‌గా నిలిచిందని చెప్పిన ఎడిటర్ చీఫ్ MJ డే.. ‘LGBTQ+ కమ్యూనిటీకి చెందిన గ్రామీ విజేత, కళాకారిణి.. సంప్రదాయ నిబంధనలను ధిక్కరిస్తూ సూపర్ స్టార్డమ్తో తనదైన మార్గాన్ని ఏర్పరచుకుంది. మనందరికీ స్ఫూర్తిదాయకం. ఆమె నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది’ అంటూ ప్రశంసలు కురిపించాడు.
Also Read..
బాలీవుడ్ అందరికీ అవకాశాలివ్వదు.. షెహనాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్