Kiccha Sudeep : కిచ్చా సుదీప్ కొత్త మూవీ టీజర్ విడుదల
కన్నడ డైనమిక్ హీరో కిచ్చా సుదీప్, దర్శకుడు విజయ్ కార్తికేయ కాంబినేషన్ లో ఓ మూవీ వస్తున్న విషయం అందరికీ తెలిసిందే.
దిశ, వెబ్ డెస్క్ : కన్నడ డైనమిక్ హీరో కిచ్చా సుదీప్, దర్శకుడు విజయ్ కార్తికేయ కాంబినేషన్ లో ఓ మూవీ వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి 'కే46 డెమోన్ వార్ బిగిన్స్' అంటూ ఓ పవర్ ఫుల్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఓ బస్సులో బుల్లెట్ గాయాలతో కిచ్చా సుదీప్.. తనకు తానుగా బాడీలోంచి బుల్లెట్స్ తీసుకుంటూ టీజర్ లో కనిపించాడు. ఆ టీజర్ చివర్లో 'యుద్ధాన్ని ఆరంభించేవాడు నాకు నచ్చడు.. యుద్ధానికి భయపడి పారిపోయే వాడూ నచ్చడు ' అని కిచ్చా చేప్పే డైలాగ్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. ఈ మూవీకి అజనీష్ లోకనాథ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. వీ క్రియేషన్స్, సుదీప్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
Also Read: రామ్ చరణ్, ఉపాసన పెంచుకునే పెట్ డాగ్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?