Kiara Advani : హాట్ లుక్ తో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తున్న కియారా.. ఆ డ్రెస్సు ధర అన్ని లక్షలా ?

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Update: 2024-08-04 12:58 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్లోనే కాకుండా టాలీవుడ్లో కూడా పాపులారిటీ సంపాదించుకుంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే ఇంకో వైపు ఆమె అభిమానుల కోసం సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్స్ చేస్తూ బిజీ అయింది. ఫ్యాషన్ హీరోయిన్స్ అందరూ ఒక వైపు అయితే ఈమె ఒక్కటే ఒక వైపు ఉంటుంది ఎందుకంటే డ్రెస్సింగ్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుంది. తాజాగా, బోల్డ్ డ్రెస్సుతో ఉన్న ఫొటోలను షేర్ చేసింది.

తాజాగా కియారా హాట్ లుక్ తో ఫోటోలను షేర్ చేసింది.. బ్లూ డ్రెస్సులో ఆమె మెరిసిపోతుంది. నెట్టింట వైరల్ అవ్వడంతో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఓ షూటింగ్ లో కరీనా కపూర్ ఖాన్ , సుహానా ఖాన్ కూడా ఆమెతో పాటు పాల్గొన్నారు. వీరిలో కియారా వేసుకున్న బ్లూ డ్రెస్సు మాత్రం అందర్ని అట్ట్రాక్ట్ చేస్తుంది.

చూడటానికి సింపుల్ గా ధర మాత్రం వేలల్లో ఉంది. రూ. 49,634 ఉంటుందని తెలిసిన సమాచారం. ఆ డ్రెస్సుకు తగ్గట్లు మేకప్ కూడా వేసింది. మొత్తానికి ఈ ముద్దుగుమ్మ లుక్ సూపర్. ఇక మూవీస్ విషయానికొస్తే.. గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తుంది. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags:    

Similar News