ఇండస్ట్రీలో నాకు నేనే పోటీ.. వాళ్లతో పోల్చుకోవడం నచ్చదు
ఇండస్ట్రీలో ఉన్న స్టార్ నటీమణులెవరినీ పోటీగా భావించనని చెప్తోంది నటి కియార అద్వాణీ. ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’, ‘వార్-2’ వంటి చిత్రాల్లో నటిస్తున్న ఆమె రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో కెరీర్ అనుభవాలను
దిశ, సినిమా: ఇండస్ట్రీలో ఉన్న స్టార్ నటీమణులెవరినీ పోటీగా భావించనని చెప్తోంది నటి కియార అద్వాణీ. ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’, ‘వార్-2’ వంటి చిత్రాల్లో నటిస్తున్న ఆమె రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో కెరీర్ అనుభవాలను షేర్ చేసుకుంది. ‘ప్రతి చిత్రాన్ని ఓ సవాలుగా తీసుకుంటా. నటిగా పరిణతి సాధించడమే నా ప్రధాన లక్ష్యం. పరిశ్రమలో ఇతరుల ఎదుగుదల గురించి ఆలోచించను. ఎందుకంటే ప్రతీ నటికి కొన్ని ప్రత్యేకతలుంటాయి. అందుకే కెరీర్పరమైన పోటీ గురించి పట్టించుకోను. వృత్తిపరంగా గతేడాది కంటే నేడు ఎంత మెరుగ్గా ఉన్నామన్నదే నాకు ముఖ్యం. నాతో నేను పోటీ పడుతూ ఉత్తమ నటిగా పరివర్తన పొందే క్రమాన్ని ఆస్వాదిస్తున్నా. కాలం గడుస్తున్న కొద్ది మన ప్రతిభాపాటవాల్లో మార్పు ఉండాలి. అలా లేకుంటే సమయం వృథా అయినట్లే. రెండేళ్ల క్రితంతో పోల్చితే సినిమాల ఎంపికలో నేను ఎంతో పరిణతి చెందాను. నటిగా నా ప్రయాణం గర్వంగా అనిపిస్తోంది’ అంటూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.