ఇద్దరు పిల్లలకు తల్లి కావడం ఆనందంగా ఉంది : స్టార్ మోడల్ Khloe Kardashian

దిశ, సినిమా : ప్రముఖ మోడల్ ఖ్లో కర్దాషియన్ ఇద్దరూ బిడ్డలకు తల్లిగా ఉండటాన్ని ఆస్వాదిస్తున్నట్లుగా తెలిపింది.

Update: 2022-09-01 13:43 GMT

దిశ, సినిమా : ప్రముఖ మోడల్ ఖ్లో కర్దాషియన్ ఇద్దరూ బిడ్డలకు తల్లిగా ఉండటాన్ని ఆస్వాదిస్తున్నట్లుగా తెలిపింది. 2018లో కుమార్తె 'థాంప్సన్'కు జన్మనిచ్చిన ఆమె.. ఇటీవలే సరోగేట్ ద్వారా గర్భందాల్చి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. సెకండ్ బేబీని స్వాగతించడం సంతోషం ఉందన్న కర్ధాషియన్.. 'ఇది కొంచెం కష్టతరమని తెలుసు. ఎన్నో కఠిన పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ మాతృత్వంలోని మాధుర్యాన్ని అణువణువు ప్రేమిస్తున్నా. చిన్నప్పటి నుంచి పేరెంటింగ్ అంటే చాలా ఇష్టం. చిన్న పిల్లలను పెంచి పెద్ద చేయడం నిజంగా గొప్ప వరం. దాన్ని గౌరవంగా భావిస్తా. అలాగే పిల్లలకు సంబంధించిన సమాచారాన్ని బహిర్గతం చేసేముందు తల్లిదండ్రులు సీరియస్‌గా ఆలోచించాలి. ఎందుకంటే ఇది కొన్నిసార్లు భయానకమైన రిజల్ట్ ఇస్తుంది' అని చెప్పుకొచ్చింది. అంతేకాదు ఒకవైపు అమ్మగా విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు ప్రొఫెషనల్‌గానూ సక్సెస్‌ అవుతానని వివరించింది. 

ఆ ఇద్దరితో తనివితీరా శృంగారంలో పాల్గొన్నా : స్టార్ సింగర్

Full View
Tags:    

Similar News