Keerthy Suresh:నేరుగా ఓటీటీలో రిలీజ్ కానున్న జూనియర్ సావిత్రి మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

టాలీవుడ్ హీరోయిన్ కీర్తీ సురేశ్ అందం, అభినయం, నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు.

Update: 2024-07-28 04:17 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ కీర్తీ సురేశ్ అందం, అభినయం, నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఈ బ్యూటీ కేవలం తెలుగు చిత్రాల్లో మాత్రమే కాకుండా మలయాళం, తెలుగు తమిళ మూవీల్లో కూడా నటించి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. కీర్తి బాలనటిగా తెరంగేట్రం చేసింది. ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ కంప్లీట్ చేసి..సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.

ఏ ముహూర్తాన అడుగుపెట్టిందో తెలియదు కానీ.. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు(నేను శైలజ, నేను లోకల్, మిస్ ఇండియా, రంగ్ దే, సర్కారు వారి పాట, దసరా) ఎంపిక చేసుకుని అతితక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అగ్ర హీరోలైన మెగాస్టార్ చిరంజీవి అండ్ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు చెల్లెలిగా నటించి ఎమోషనల్‌గా తెలుగు ప్రేక్షకులకు కన్నీళ్లు పెట్టించింది.

కీర్తి తెలుగులో కన్నా తమిళంలో నటించిన సినిమాలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదు ఎన్న మాయం, రజిని మురుగన్, తొడర, పాంబు సట్టై, థానా సెర్ధా కూటమ్, నడిగైయర్ తిలగమ్, సామి స్క్వేర్, సండ కోళి 2, మామన్నన్ వంటి సినిమాల్లో అద్భుతంగా నటించింది. ఇక తెలుగులో వచ్చిన సావిత్రి సినిమా గురించైతే మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. మరో ఏ హీరోయిన్ నటించిన ఆ పాత్రకు ప్రాణం పోసేవారు కాదేమో. అంతలా లీనమై నటించింది.

ఈ హీరోయిన్ ప్రస్తుతం కమెడీ ఎంటర్‌టైనర్‌లో‘ఉప్పు కప్పురంగు’ అనే టైటిల్‌లో వస్తోన్న చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుత ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అనిల్ శశి దర్శకత్వం వహిస్తోన్న సుహాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీలో విడుదల కానుందట. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవ్వనుందని నెట్టింట టాక్ నడుస్తోంది. తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో విడుదల చేయనున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

Tags:    

Similar News