స్టన్నింగ్ లుక్‌లో కీర్తి సురేష్.. ఆ సినిమా కోసమేనా?
మలయాళ బ్యూటీ కీర్తి సురేష్ వారసత్వంతో ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ సొంత ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది.
దిశ, సినిమా: మలయాళ బ్యూటీ కీర్తి సురేష్ వారసత్వంతో ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ సొంత ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో చిత్రాల్లో నటించినప్పటికీ కీర్తి 2013 లో గీతాంజలి మూవీతో కథానాయికగా అవతారం ఎత్తింది. టాలీవుడ్‌లో ‘నేను శైలజ’ చిత్రంతో అడుగుపెట్టి.. మొదటి సినిమాతోనే బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చి.. ప్రేక్షకులను కట్టి పడేసింది. ఈ దెబ్బకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ వంటి స్టార్ హీరోల మూవీల్లో అవకాశాలు దక్కించుకుంది.
ఇక ఈ అమ్మడు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ సరసన నటిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కీర్తి బాలీవుడ్‌లో ఫస్ట్ సినిమానే స్టార్ హీరో వరుణ్ ధావన్‌తో జోడి కట్టడంతో ప్రేక్షకులందరూ వీరిద్దరి సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా కీర్తి సురేష్ ఈ చిత్రం కోసం శారీలో బ్యూటిఫుల్ శారీలో స్టన్నింగ్ ఫొటో షూట్ చేసింది. ఎల్లో శారీలో.. తలలో మల్లెపూలు పెట్టుకుని.. సంప్రదాయంగా కనిపించి యువతను ఫిదా చేస్తున్న ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.