Keerthy Suresh: కీర్తి సురేశ్ రఘు తాత ట్రైలర్ విడుదల
హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
దిశ, సినిమా: హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు తాజాగా నటిస్తున్న చిత్రం రఘు తాత. సుమన్ కుమార్ డైరెక్షన్ చేస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముందుగా చెప్పిన అప్డేట్ ప్రకారమే ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. హే నువ్వు ఎందుకు అమ్మాయిలా డ్రెస్ వేసుకోలేదని కీర్తిసురేశ్‌ను అడుగుతుంటే.. నేను సరైన అమ్మాయి కాబట్టే వేసుకోలేదంటూ తింగరిగా చెప్పే డైలాగ్స్‌తో స్టార్ట్ అయింది ట్రైలర్.
ముందు నువ్వు అమ్మాయిలా ఎలా ఉండాలో నేర్చుకో అని కీర్తిసురేశ్‌కు అధికారి చెబుతాడు. ఇంకో వైపు రవీంద్ర విజయ్, కీర్తిసురేశ్ లవ్ ట్రాక్‌తో సాగే ట్రైలర్ మూవీపై భారీగా అంచనాలు పెంచేసింది. హిందీ అసలు తెలియని తమిళ అమ్మాయి బయటకి వెళ్తే ఎలాంటి సమస్యలను ఎదుర్కొందనే నేపథ్యంలో ట్రైలర్‌ని బాగా కట్ చేసారు. కేజీఎఫ్, సలార్ లాంటి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన పాపులర్ బ్యానర్ హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తుండడటంతో భారీగా హైప్ క్రియోట్ అయింది. ఈ సినిమాకి షాన్ రోల్డన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.