Keerthy Suresh: చైల్డ్‌హుడ్ ఫ్రెండ్‌తో కీర్తి సురేశ్ పెళ్లి.. క్లారిటీ ఇచ్చేసిన బ్యూటీ!
టాలీవుడ్ మహానటిగా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘రఘుతాత’.
దిశ, సినిమా: టాలీవుడ్ మహానటిగా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘రఘుతాత’. సుమన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి అప్‌డేట్ ఎంతో ఆకట్టుకున్నాయి. ఇక ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఈ సినిమా సిద్ధంగా ఉండటంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్.. తన చెల్డ్‌హుడ్ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలై స్పందించి క్లారిటీ ఇచ్చింది.
‘సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రూమర్స్‌పై మనం క్లారిటీ ఇచ్చిన అవి నిజమనే నమ్ముతారు. అందుకే అలాంటి రూమర్స్‌పై నేను స్పందించను. అయితే.. నా నటన గురించి, సినిమాల ఎంపిక విషయంపై ఏవైనా వార్తలు వస్తే మాత్రం వాటిని తప్పకుండా స్వీకరిస్తాను. వాటి నుంచి కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడతాను. నా వ్యక్తిగత జీవితం, కుటుంబం గురించి ఎవరైనా కామెంట్స్ చేస్తే వాటిని పట్టించుకోను. అలాగే ఆ కామెంట్స్ అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు’ అంటూ చెప్పుకొచ్చింది.