నా భర్త నాతో అస్సలు గడపడు.. రిలేషన్ గురించి రివీల్ చేసిన చేసిన కార్తీక దీపం వంటలక్క
‘కార్తీక దీపం’ సీరియల్లో దీప పాత్రలో నటించిన ప్రేమీ విశ్వనాథ్ గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.
దిశ, సినిమా: ‘కార్తీక దీపం’ సీరియల్లో దీప పాత్రలో నటించిన ప్రేమీ విశ్వనాథ్ గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. వంటలక్క పేరు అనగానే బుల్లితెర ప్రేక్షకులను ఇట్టే గుర్తొస్తుంది. తమిళ ఇండస్ట్రీ నుంచి తెలుగు పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి.. కార్తీక దీపం సీరియల్తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూకు హాజరై పలు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది.
‘‘కెరీర్ కోసం నా పిల్లల్ని వదిలి నేను తెలుగు పరిశ్రమకు వచ్చాను. నా భర్త దగ్గర అస్సలు ఉండను. అని తెలిపింది. అప్పుడు మీ హస్బెండ్ కి కోపం రాదా అని యాంకర్ ప్రశ్నించగా.. నేను నిజం చెప్పాలంటే.. నేను కేరళలో ఉన్నప్పుడు తాను కేరళలో ఉండడు. నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు తను హైదరాబాద్ లో ఉండడు. నేను ఒక రాష్ట్రంలో ఉంటే ఆయన ఒక స్టేట్లో ఉంటాడు. నా భర్త నా కన్నా బిజీగా ఉంటారు. ఎప్పుడో ఒకసారి కలుస్తామంతే. అంటూ ప్రేమీ విశ్వనాథ్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం వంటలక్క కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read More..
చక్రవాకం సీరియల్ హీరోయిన్ స్రవంతి .. ఇప్పుడు ఎలా మారిపోయిందో చూస్తే షాక్ అవుతారు